రిజర్వేషన్ల ఖరారు
జిల్లాలో మార్కెట్ యార్డులకు
సంక్రాంతి నాటికి పాలకవర్గాల నియామకం జరిగే అవకాశం
నరసరావుపేట: జిల్లాలోని 12 మార్కెట్ యార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వారం క్రితమే జిల్లా కలెక్టర్ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీటికి జిల్లాలోని ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆమోద ముద్ర వేశారు. వచ్చే సంక్రాంతి నాటికి పాలకవర్గాలను నియమించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రతి కమిటీకి గౌరవ చైర్మన్‌గా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొనసాగుతారు. నామినేటెడ్ చైర్మన్, వైస్ చైర్మన్లతో కలిపి 12 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు నియమితులు కానున్నారు. సభ్యుల్లో కూటమిలోని మూడు పార్టీలకు చెందిన వారికి స్థానం కల్పించే అవకాశం ఉంది. యార్డుల వారీగా రిజర్వేషన్లు పరిశీలిస్తే.. నరసరావుపేట (ఓసీ–జనరల్), రొంపిచర్ల (ఎస్సీ–మహిళ), వినుకొండ (బీసీ) ఈపూరు (ఎస్టీ–మహిళ), చిలకలూరిపేట(ఓసీ–జనరల్), సత్తెనపల్లి (ఓసీ–మహిళ), రాజుపాలెం (బీసీ), మాచర్ల (బీసీ–మహిళ), దుర్గి(ఓసీ–జనరల్), క్రోసూరు( ఓసీ–మహిళ), పిడుగురాళ్ల (ఎస్‌సీ–మహిళ), గురజాల (ఓసీ–జనరల్)గా రిజర్వు చేశారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద ఆదివారం 1516 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 148, తూర్పు కెనాల్‌కు 200, పశ్చిమ కెనాల్‌కు 100, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మమూరు కాలువకు 975 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment