ప్రభుత్వ శాఖల విద్యుత్‌ బకాయిలు రూ.437 కోట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ శాఖల విద్యుత్‌ బకాయిలు రూ.437 కోట్లు

Published Mon, Jan 6 2025 8:14 AM | Last Updated on Mon, Jan 6 2025 8:14 AM

ప్రభు

ప్రభుత్వ శాఖల విద్యుత్‌ బకాయిలు రూ.437 కోట్లు

నరసరావుపేట: ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు విద్యుత్‌ శాఖకు భారీగా బకాయిలు పడ్డాయి. పల్నాడు జిల్లా సూపరింటెండెంట్‌ పరిధిలోని హైటెన్షన్‌, లో–టెన్షన్‌ విభాగాల్లో మొత్తం రూ.437 కోట్లు పేరుకుపోవటం విశేషం. ఒక్క న్యాయశాఖ మినహా మిగతా అన్ని విభాగాల్లోనూ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వీటిలో గతేడాది నవంబరు ఆఖరునాటికి హెచ్‌టీ విభాగంలో రూ.218 కోట్లు, ఎల్‌టీ విభాగంలో రూ.219 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా లోటెన్షన్‌(ఎల్‌టీ) విభాగంలో ఏడు ఈఆర్‌వో(ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్‌) సెక్షన్లు ఉన్నాయి. నరసరావుపేట ఈఆర్‌వో సెక్షన్‌, రొంపిచర్ల సబ్‌ ఈఆర్వో సెక్షన్లలో 508 ప్రభుత్వ సర్వీసులు ఉన్నాయి. మొత్తం బకాయిలు రూ.15.84 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో లక్షలకు లక్షలు కరెంటు బకాయిలు చెల్లించాల్సిన సర్వీసులు అనేకం ఉన్నాయి. డీ–1 సెక్షన్‌ పరిధిలో 122 ప్రభుత్వ సర్వీసులు ఉండగా వాటిలో కొన్ని పరిశీలిస్తే.. సత్తెనపల్లిరోడ్డులోని శ్రీ కోడెల శివప్రసాదరావు స్టేడియం(డీఎస్‌ఏ) రూ.1.09 లక్షలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం రూ.1.48 లక్షలు, మున్సిపల్‌ బాలుర హైస్కూలు రూ.4.02 లక్షలు, బాలికల హైస్కూలు రూ.3,30 లక్షలు, ఏపీ ఫైబర్‌ నెట్‌ బకాయి రూ.12 లక్షలు ఉంది. మొత్తం బకాయిలు రూ.1.04 కోట్లు ఉన్నాయి. అలాగే డీ–2 సెక్షన్‌ పరిధిలో 186 సర్వీసులు ఉండగా మొత్తంపై రూ.12.02 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిలో మున్సిపల్‌ పార్కు రూ.3.35 లక్షలు, ప్రభుత్వ వైద్యశాల రూ.62.63 లక్షలు, ఆర్‌అండ్‌బీ డిపార్టుమెంట్‌రూ.1.25 లక్షలు, తహసీల్దార్‌ కార్యాలయం రూ.28.38 లక్షలు, సబ్‌జైలు రూ.5.62 లక్షలు, జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం రూ.1.65 లక్షలు బకాయిలు ఉన్నాయి. అలాగే డీ–3 సెక్షన్‌ పరిధిలో 246 సర్వీసులు మొత్తం బకాయిలు రూ.1.64 కోట్లు ఉండగా వాటిలో కోటప్పకొండలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ విబాగం రూ.7.86 లక్షలు, ఫారెస్టు విభాగం రూ.1.33 లక్షలు, మెడికల్‌ ఆఫీసర్‌ కార్యాలయం రూ.3.99 లక్షలు, పంచాయతీరాజ్‌ సెక్షన్‌ రూ.6.63 లక్షలు, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ కార్యాలయం రూ.29.75 లక్షలు, ఏపీ టూరిజం రూ.1.20 లక్షలు, బీసీ కాలనీలోని ఎన్‌ఎస్పీ ఎస్‌ఈ కార్యాలయం రూ.3.24 లక్షలు ఉన్నాయి. రొంపిచర్ల సెక్షన్‌లో రూ.47.86 లక్షలు బకాయి ఉండగా వాటిలో ఎంపీడీఓ కార్యాలయం బకాయి రూ.1.95 లక్షలు, తహసీల్దార్‌ కార్యాలయం రూ.9.27 లక్షలు, విప్పర్ల పీహెచ్‌సీ రూ.6.84 లక్షలు బకాయిలు ఉన్నాయి. అలాగే నకరికల్లు సెక్షన్‌లో మొత్తం బకాయిలు రూ.67.78 లక్షలు బకాయిలు ఉన్నాయి.

వసూలైనవి రూ.149 కోట్లు న్యాయశాఖ మినహా మిగతా విభాగాలన్నింటిలోనూ బకాయిలు

జిల్లాలో లోటెన్షన్‌ విభాగంలో మొత్తం బకాయిలు ఇలా ఉన్నాయి.

ఈఆర్వో సర్వీసులు బకాయిలు కలెక్షన్‌ మిగులు

(రూ.కోట్లు) (రూ.కోట్లు) (రూ.కోట్లు)

నరసరావుపేట 1,575 14.76 4.13 10.63

సత్తెనపల్లి 1,367 13.09 3.59 09.50

వినుకొండ 1,483 14.65 4.02 10.62

దాచేపల్లి 986 36.86 12.38 24.47

గురజాల 1199 47.47 15.2 32.26

మాచర్ల 1547 75.68 25.18 50.50

పిడుగురాళ్ల 1091 1.77 57.06 120.04

మొత్తం 9248 219.60 68.08 150.08

హెచ్‌టీ సెక్షన్‌ బకాయిలకు ప్రభుత్వం రూ.81 కోట్లు చెల్లించింది

జిల్లా పరిధిలో ప్రభుత్వ సర్వీసుల నుంచి బకాయిలు భారీగా ఉన్నాయి. వాటిలో హెచ్‌టీ సెక్షన్‌లో రూ.218 కోట్లు ఉండగా గత నెలలో రూ.81 కోట్ల వరకు వసూలుచేశాం. మిగతా బకాయిలను వసూలుచేస్తాం.

– గుంటూరు విజయకుమార్‌, సూపరిండెంట్‌ ఇంజనీర్‌, విద్యుత్‌శాఖ

ఇటీవలనే రూ.కోటి చెల్లించాం

మున్సిపాలిటీ విద్యుత్‌ బకాయిల్లో రూ.కోటి మొత్తాన్ని 15వ పైనాన్స్‌ నిధుల నుంచి ఆ సంస్థకు చెల్లించాం. మిగతా రూ.80లక్షల వరకు త్వరలో చెల్లించేస్తాం.

– ఎం.జస్వంతరావు, మున్సిపల్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభుత్వ శాఖల విద్యుత్‌ బకాయిలు రూ.437 కోట్లు 1
1/2

ప్రభుత్వ శాఖల విద్యుత్‌ బకాయిలు రూ.437 కోట్లు

ప్రభుత్వ శాఖల విద్యుత్‌ బకాయిలు రూ.437 కోట్లు 2
2/2

ప్రభుత్వ శాఖల విద్యుత్‌ బకాయిలు రూ.437 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement