క్రికెట్ పోటీల చాంపియన్‌గా విజ్ఞాన్ వర్సిటీ
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో 18వ ఎడిషన్ మహోత్సవ్–2కే25లో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి క్రికెట్ చాంపియన్‌షిప్ విజేతగా విజ్ఞాన్ వర్సిటీ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో నరసరావుపట ఇంజినీరింగ్ కళాశాలపై విజ్ఞాన్ జట్టు 25 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన విజ్ఞాన్ జట్టు నిర్ణీత 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ జట్టు 6 వికెట్లు కోల్పోయి 74 పరుగులు మాత్రమే చేసింది. బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీపై ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్ కాలేజీ జట్టు 16 పరుగుల తేడాతో గెలిచి మూడో స్థానంలో నిలిచింది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు ప్రశంసా పత్రాలు, మెడల్స్‌తోపాటు విన్నర్‌కు రూ. 50వేలు, రన్నర్‌కు రూ.30 వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.20 వేలు, నాలుగో స్థానం పొందిన జట్టుకు రూ.10 వేల వంతున నగదు బహుమతులను అందించారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment