విరిగిన గేటు.. నిలిచిన నీరు
కారెంపూడి: మేజర్ కాల్వకు నీరు నిలిచిపోవడంతో పెదకొదమగుండ్ల బ్రాంచి కాల్వ పరిధిలో వేలాది రైతులు సాగునీటి కోసం గత పది రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన సాగర్ కుడి కాల్వ నుంచి నీరు విడుదలయ్యే చోట గేటు విరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డు పడింది. దీంతో కాల్వకు నీరు నిలిచిపోయింది. గత రెండు రోజులుగా నీటి ప్రవాహానికి పొట్టు గోతాలు అడ్డుపెట్టి విరిగిన గేటును బయటకు తీయడానికి కాల్వ నీటి సంఘం అధ్యక్షుడు పోలయ్య ఆధ్వర్యంలో రైతులు, లస్కర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నారుమళ్లు ఏతకు వచ్చాయి. దమ్ము చేసి నాట్లు వేయడానికి పొలాలు సిద్ధం అవుతున్నాయి. ఈ దశలో పది రోజులుగా నీరు నిలిచిపోవడంతో పనులన్నీ స్తంభించాయి. ఈ కాల్వ పరిధిలో కారెంపూడి, ఒప్పిచర్ల, కాకానివారిపాలెం, రెడ్డిపాలెం, వేపకంపల్లి, పెదకొదమగుండ్ల రైతుల పొలాలున్నాయి. ఎక్కువగా మాగాణి భూములు, మెట్ట పైర్లు సాగులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment