కలెక్టర్ పి.అరుణ్‌బాబు
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 64 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు ఇక్కడకి వస్తుంటారన్నారు. వారి సమస్యలను సావధానంగా విని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారు కూడా సంతృప్తి చెందాలని సూచించారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి ఏ.మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment