నూరేళ్ల దీవెన.. నిండుగా ఉండాలి !
పెదకూరపాడు: నూరేళ్ల దీవెన ... నిండుగా ఉండాలి ! పాటిబండ్ల నుంచి ఎంతో మంది దైవసేవలో తరించాలని తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులు దైవదేవుడిని ప్రార్థించారు. మండలంలోని పాటిబండ్లలో మూడు రోజులుగా జరుగుతున్న ముగ్గురు రాజుల శత వార్షిక వేడుకలు సోమవారంతో ముగిశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు తరలివచ్చి , పూర్ణకుంభంతో భక్తులకు ఆశీస్సులు అందించారు. పుణ్యభూమి పాటిబండ్ల నుంచి భవిష్యత్‌లో అనేక మంది గురువులు, మఠకన్యలు రావాలని ఆకాంక్షించారు.
కథోలికలకు పుట్టినిల్లు
ముగ్గురు రాజుల శత వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజు పండుగ సమష్టి దివ్య పూజబలిని గుంటూరు పీఠాధిపతులు మహాఘన రైట్ రెవరెండ్ చిన్నాబత్తిన భాగ్యయ్య, తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులు, గురువులు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాకుళం పీఠాధిపతులు మహాఘన, రైట్ రెవరెండ్ డాక్టర్ రాయరాల విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు సందేశం అందించారు.ప్రేమ, కరుణ, జాలి ముఖ్య ఆయుధాలుగా కథోలికలు దైవచింతనతో మెలగాలని కోరారు. అనంతరం పీఠాధిపతులు భక్తులను ఆశీర్వదించారు. కోలాటం, భజన , సంప్రదాయ నృత్యాలతో కళకారులు అలరించారు.భక్తులు కొవ్వొత్తులను సమర్పించారు. వేడుకలలో పెదకూరపాడు శాసన సభ్యులు భాష్యం ప్రవీణ్ దంపతులు, సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు.
తరలివచ్చిన పీఠాధిపతులు
గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిన బాగ్యయ్య సుందరీకరించిన దేవాలయంలో దివ్యసత్ప్రసాద ఆరాధన నిర్వహించారు. పూర్వ గుంటూరు బిషప్, కడప అపొస్తలిక పాలనాధికారి గాలి బాలి, విజయవాడ బిషప్ తెలగతోటి రాజారావు, నల్గొండ బిషప్ గోరంట్ల జోర్నేస్, వరంగల్ బిషప్ ఉడుముల బాల, ఖమ్మం బిషప్ సాగలి ప్రకాష్, నల్గొండ విశ్రాంత బిషప్ థామస్ కమల్, శ్రీకాకుళం బిషప్ రాయరాల విజయకుమార్, నెల్లూరు బిషప్ పిల్లి అంథోని దాసు పాల్గొన్నారు.
కన్నుపండవగా తేరు ఊరేగింపు
బాణసంచా అనంతరం తేరును బ్యాండు వాయిద్యలతో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. సంఘ పెద్దలు, గురువులు, మఠకన్యలు వేలాదిగా పాల్గొన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్త్ నిర్వహించారు.
పాటిబండ్ల గ్రామానికి ప్రత్యేక దీవెనలు అందించిన తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులు చిరస్థాయిగా నిలిచేలా పాటిబండ్ల శత వార్షికోత్సవ వేడుకలు దివ్య పూజాబలికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు
Comments
Please login to add a commentAdd a comment