సిమెంట్ ఫ్యాక్టరీలో దొంగల బీభత్సం
దాచేపల్లి: మండలం గామాలపాడు గ్రామ సమీపంలోని ఓ సిమెంటు ఫ్యాక్టరీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి యజమానులు ఊరు వెళ్లిన సమయంలో తాళాలు పగులగొట్టి సుమారు రూ.35 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గామాలపాడు సమీపంలోని ఓ సిమెంటు ఫ్యాక్టరీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా వి.శంకర్‌నారాయణరెడ్డి పని చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గత శనివారం షిర్డీ వెళ్లారు. ఈ క్రమంలో శంకరనారాయణరెడ్డి నివాసం ఉంటున్న ఏ–14 క్వార్టర్‌లోకి దొంగలు ప్రవేశించి బీరువా, లాకర్‌లో ఉన్న 20 తులాల బంగారం, 16 తులాల వెండి, రూ.20వేలు నగదు దోచుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.16.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం ఏ–9 క్వార్టర్‌లో నివాసం ఉంటున్న కె.వీరప్రకాష్ నివాసంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా, లాకర్‌లో ఉన్న రూ. 17.5 లక్షల విలువ చేసే 20 తులాల బంగారు ఆభరణాలతోపాటు, రెండున్నర కిలోల వెండి దోచుకెళ్లారు. వీరప్రకాష్ స్వగ్రామమైన అనంతపురం వెళ్లారు. వీరు ఇంట్లో లేని సమయంలో ఈ చోరీలు జరగడం స్థానికంగా కలకలం రేపింది.
రెండు నివాసాల్లో భారీ చోరీ రూ.35 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాల చోరీ
Comments
Please login to add a commentAdd a comment