పల్నాడు
మంగళవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2025
సాక్షి, నరసరావుపేట: మూడు నకిలీ వే బిల్లులు, ఆరు చెక్‌పోస్టులుగా సాగుతున్న గ్రానైట్ అక్రమ రవాణా కాస్తా కూటమి నేతల లుకలుకలతో రోడ్డునపడింది. ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రాలకు నిత్యం వందల లారీలు ఆంధ్ర బార్డర్ దాటుతున్నాయి. పోలీసులు, రవాణాశాఖ, మైనింగ్, జీఎస్టీ అధికారులకు భయపడకుండా, పగలు రాత్రీ అని తేడా లేకుండా జీరో బిల్లులతో గ్రానైట్ పక్క రాష్ట్రాలకు తరలింది. యథేచ్చగా సాగుతున్న గ్రానైట్ మాఫియాపై గత శనివారం పలు ప్రాంతాల్లో మూకుమ్మడిగా జీఎస్టీ అధికారులు దాడులు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎప్పుడు లేనివిధంగా ఏకంగా ఆరు ప్రత్యేక టీంలుగా ఏర్పడ్డాయి. నరసరావుపేట, నకరికల్లు, కొండమోడు, బాపట్ల జిల్లా మార్టురు, సంతమాగులూరు, బల్లికురవ ప్రాంతాల్లో దాడులు చేసి 14 లారీలను పట్టుకొని రూ.25 లక్షల దాకా జరిమానా విఽధించారు. అయితే, ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో దాడులు చేయడంపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గ్రానైట్ దందాలో వర్గపోరుతోనే ఈ దాడులు జరిగాయనే ప్రచారం నడుస్తోంది.
మార్టూరు గ్రానైట్ సిండికేట్‌కు
వ్యతిరేకంగా...
బాపట్ల జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిఽధి ఆధ్వర్యంలో ఈ గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారం జరుగుతోందన్న విషయం అందరికి తెలిసిందే. ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న వ్యక్తి గ్రానైట్ సిండికేట్‌ను నిర్వహిస్తున్నారు. టోకెన్ అమ్మే దగ్గర నుంచి ఈ–వే బిల్లు, జిల్లా దాటించడం, తెలంగాణలో డబ్బుల పంపిణీ వరకు మొత్తం అతనే చూస్తున్నాడు. రూ.14 వేల టోకెన్‌ను ఏకంగా రూ.30 వేలు వసూల్ చేసి దందాకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అఽధికారులకు ముట్టజెపుతున్నాడు. బాపట్ల జిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధికి , పల్నాడులో ఓ సీనియర్ ఎమ్మెల్యేకు నెలవారీ మామూళ్లు చేరుతున్నాయి. అయితే, ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా జరిగే ప్రాంతాల ప్రజాప్రతినిధులకు మార్టూరు గ్రానైట్ సిండికేట్ నుంచి వాటా రావడంలేదని వారిలో అసంతృప్తి నెలకొందని సమాచారం. దీంతో కూటమి నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందట. ఈ నేపథ్యంలో అసంతృప్తిలో ఉన్న ప్రజాప్రతినిధులు అక్రమ రవాణాపై శనివారం రాష్ట్ర జీఎస్‌టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి, దాడులు జరిగేలా చేశారన్న ప్రచారం పల్నాడులో బాహాటంగా వినిపిస్తోంది. ఒకరిద్దరు కీలక నేతలకు మాత్రమే అనుకూలంగా పనిచేస్తున్న గ్రానైట్ సిండికేట్‌ను మార్చి, తమకు రావాల్సిన వాటా వచ్చే వరకు అక్రమ రవాణాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారని సమాచారం.
నోటీసులు ఇచ్చి వదిలేశారు
గ్రామ సర్వే నంబరు 216లో ఉన్న 16సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించి అనధికారికంగా ఇళ్లు నిర్మించారు. దీనిపై గతేడాది అక్టోబరు 21న మీ కోసంలో ఫిర్యాదు చేశా. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్‌కు ఆధారాలు కూడా సమర్పించా. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకు మిగతా చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై 16ఏళ్లుగా పోరాడుతున్నా.
–ఆవుల సాంబశివరావు,
గణపవరం, నాదెండ్ల మండలం
కాలువల మరమ్మతు వెంటనే చేయాలి
నాగార్జున సాగర్ కుడికాల్వ పరిధిలో ఉన్న ఎన్‌ఎస్పీ కాలువలు మరమ్మతులు చేయక పోవడం వల్ల అడవిని తలపించేలా ఉన్నాయి. కాలువలు పూడిపోయి నీళ్లు పొలాల మీద, ఇళ్లపై ప్రవహిస్తున్నాయి. రైతులు కాలువ మీద నడవడానికి రహదారి సౌకర్యం కూడా లేదు. చివరి భూములకు నీళ్లు అందట్లేదు. నరసరావుపేట మండలంలోని రావిపాడు, జొన్నలగడ్డ, కేసనపల్లి కాలువలు, వినుకొండ దగ్గర బ్రాహ్మణపల్లి – విఠంరాజుపల్లి కాలువ, ఈపూరు కాలువ, నూజెండ్ల దగ్గర ఉన్న కాలువలు సక్రమంగా లేవు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేయించాలి.
– వై.వెంకటేశ్వరరావు,
నల్లపాటి రామారావు, పీడీఎం నాయకులు
●
7
న్యూస్‌రీల్
కూటమి ప్రభుత్వంలో భారీగా జరుగుతున్న గ్రానైట్ అక్రమ రవాణా ప్రకాశం జిల్లా కీలక ప్రజాప్రతినిధి, పల్నాడు సీనియర్ నేత ఆధ్వర్యంలో దందా ప్రాధాన్యత ఇవ్వలేదంటున్న ఇతర ప్రజాప్రతినిధులు ముడుపుల పంపకంలో కూటమి ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్‌వార్ అక్రమ రవాణాపై రాష్ట్ర జీఎస్‌టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఓ వర్గం ప్రజాప్రతినిధులు బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో శనివారం 14 గ్రానైట్ లారీలకు ఫైన్ వేసిన అధికారులు మార్టూరు సిండికేట్‌కు వ్యతిరేకంగా రోడ్డుకెక్కిన కూటమి నేతల పోరు
ఒక్కరోజుతోనే ఆగిన దాడులు
గ్రానైట్ అక్రమ రవాణాపై మూకుమ్మడిగా దాడులు చేసిన జీఎస్టీ అధికారులు ఒక్కరోజు ముచ్చటగానే ముగించారు. శనివారం పల్నాడు, బాపట్ల జిల్లాలతోపాటు గుంటూరు జిల్లా అధికారులను సైతం రప్పించి ఆరు బృందాలుగా ఏర్పడి దాడులుచేశారు. ఆది, సోమవారాలు సైతం అక్రమ గ్రానైట్ లారీలు జిల్లా మీదుగా వెళ్తున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్టు వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ రవాణాపై దాడులు ఒక్కరోజులోనే ఆగడం వెనుక ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. దాడులపై ఓ జీఎస్టీ అధికారితో మాట్లాడగా ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక ఆదేశాలు రావడంతో శనివారం చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment