శోక సంద్రంగా ఏరియా ప్రభుత్వ వైద్యశాల
● ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి ● కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
సత్తెనపల్లి: విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో శోక సంద్రంగా ఏరియా ప్రభుత్వ వైద్యశాల మారింది. మాయదారి గుంటూరు బ్రాంచ్ కెనాల్ కాలువ ఈత రూపంలో ఇద్దరు విద్యార్థులను కబళించిన సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో అపురూపంగా పెంచుకుంటున్న ఇద్దరు బిడ్డలను నీటి రూపంలో ప్రాణాలు తీసిన ఘటన అందరి హృదయాలను కలచివేసింది. ఈ దారుణంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. నల్లూరి గోపీచంద్ (15), పొదిలి చరణ్15) విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లడంతో కాలువలో అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు అరగంటకు దొరకగా .. మరొకరు 4:30 గంటలపాటు గాలిస్తే గానీ దొరకలేదు. విద్యార్థుల మృతదేహాలను ఆదివారం రాత్రి సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తీసుకొచ్చారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం ఆయా కుటుంబ సభ్యులకు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment