మాదిగలకు అన్యాయం జరగకుండా చూడాలి
నరసరావుపేట: కులగణన నిష్పక్షపాతంగా జరిపి మాదిగలకు అన్యాయం జరుగకుండా చూడాలని మాదిగ రిజర్వేషన పోరాట సాధన సమితి(ఎమ్మార్పీఎస్‌ఎస్) జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మాదిగలకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో సంఖ్యాపరంగా మాదిగలు రెండో స్థానంలో ఉన్నందున పేర్లు మార్చి మాలలుగా సచివాలయం సిబ్బంది ఎక్కిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెండు రోజులు క్రితం నరసరావుపేటలో 150 మంది మాదిగలను మాలల కులంలోకి మార్చినట్లు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందించి సోషల్ వెల్ఫేర్ డీడీతో వెరిఫికేషన్ చేయించి మాదిగలకు అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారని మీరయ్యమాదిగ చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షులు సీహెచ్.సల్మాన్‌రాజ్, వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు గుండాల ప్రభుదేవా, నరసరావుపేట టౌన్ నాయకుడు మల్లెల మధు, మండల నాయకులు జి.ప్రశాంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment