యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి
సత్తెనపల్లి: యువత నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండవీటి పద్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ వారు జాబ్ మేళాను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. పల్నాడు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు మాట్లాడుతూ జాబ్ మేళాకు నాలుగు కంపెనీలతో పాటు 59 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారని తెలిపారు. ఇందులో 35 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారన్నారు. ఎంపికై న వారికి నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో స్కిల్ హబ్ సత్తెనపల్లి కోఆర్డినేటర్ ఇందూరి రామకృష్ణారెడ్డి, రమ్య, అంజిరెడ్డి, శ్రీకాంత్, కంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధులు, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ప్రతినిధి శ్రీనివాసరావు, ఉద్యోగ కల్పన అధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment