నరసరావుపేట రూరల్: విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు డిసెంబర్ నెల జీతాలు అందలేదని, వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. డిసెంబర్ జీతాలు కొన్ని ఉద్యోగ శాఖల పెన్షనర్లకు చెల్లించారని, విద్యాశాఖలోని దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులకు నేటి వరకు అందలేదని తెలిపారు. బ్యాంక్ లోన్లు, ఈఎంఐల చెల్లింపులు, నూతన సంవత్సరం ఖర్చుల రీత్యా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని అసోసియేషన్ నాయకులు పమ్మి వెంకటరెడ్డి, బెజ్జం సంపత్‌బాబు, కొమ్ము కిశోర్‌లు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment