సంక్రాంతికి 137 స్పెషల్ బస్సులు
● ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్.శ్రీనివాసరావు ● సాధారణ బస్సు చార్జీలే అమలు
నరసరావుపేట: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి ప్రయాణికులను సొంత గ్రామాలకు చేర్చేందుకు ప్రత్యేకంగా 137 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. వీటిలో సాధారణ బస్సు చార్జీలే వసూలు చేస్తారని చెప్పారు. స్థానిక డిపోలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ఈనెల తొమ్మిదో తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదురోజుల పాటు జిల్లాలోని ఆయా డిపోల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌ల మధ్య బస్సులు నడుస్తాయని తెలిపారు.
● 9వ తేదీన 15 బస్సులు నడుస్తాయి. ఇందులో నరసరావుపేట డిపో నుంచి అల్ట్రా డీలక్స్ బస్సులు రెండు, మాచర్ల డిపో నుంచి సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సు ఒక్కొక్కటి చొప్పున నడుస్తాయి. చిలకలూరిపేట నుంచి మూడు సూపర్ లగ్జరీలు, సత్తెనపల్లి నుంచి ఒకటి, పిడుగురాళ్ల నుంచి రెండు ఎక్స్‌ప్రెస్‌లు, వినుకొండ నుంచి ఐదు అల్ట్రా డీలక్స్ బస్సులు నడుస్తాయి.
● 10వ తేదీన 40బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇందులో నరసరావుపేట నుంచి ఎనిమిది అల్ట్రా డీలక్స్‌లు, మాచర్ల నుంచి సూపర్‌లగ్జరీ ఒకటి, తొమ్మిది ఎక్స్‌ప్రెస్‌లు, చిలకలూరిపేట నుంచి సూపర్‌లగ్జరీలు మూడు, ఎక్స్‌ప్రెస్‌లు నాలుగు, సత్తెనపల్లి నుంచి ఎక్స్‌ప్రెస్ ఒకటి, పిడుగురాళ్ల నుంచి నాలుగు ఎక్స్‌ప్రెస్‌లు, వినుకొండ నుంచి అల్ట్రా డీలక్స్‌లు, ఎక్స్‌ప్రెస్‌లు ఐదు చొప్పున నడుపుతారు.
● 11వ తేదీ మొత్తం 38 బస్సులు నడుపుతుండగా వీటిలో నరసరావుపేట నుంచి ఎనిమిది అల్ట్రాడీలక్స్‌లు, మాచర్ల నుంచి సూపర్‌లగ్జరీ ఒకటి, ఎక్స్‌ప్రెస్‌లు ఏడు, చిలకలూరిపేట నుంచి సూపర్ లగ్జరీలు మూడు, ఎక్స్‌ప్రెస్‌లు నాలుగు, సత్తెనపల్లి నుంచి సూపర్ లగ్జరీ ఒకటి, పిడుగురాళ్ల నుంచి నాలుగు ఎక్స్‌ప్రెస్‌లు, వినుకొండ నుంచి ఐదు చొప్పున అల్ట్రా డీలక్స్‌లు, ఎక్స్‌ప్రెస్‌లు ఉంటాయి.
● 12వ తేదీ మొత్తం 40 బస్సులు నడుపుతుండగా, వీటిలో నరసరావుపేటకు చెందిన ఎనిమిది అల్ట్రా డీలక్స్‌లు, మాచర్లకు చెందిన సూపర్‌లగ్జరీ ఒకటి, తొమ్మిది ఎక్స్‌ప్రెస్‌లు, చిలకలూరిపేట నుంచి సూపర్ లగ్జరీలు మూడు, ఎక్స్‌ప్రెస్‌లు నాలుగు, సత్తెనపల్లి నుంచి ఒక సూపర్ లగ్జరీ, పిడుగురాళ్ల నుంచి నాలుగు ఎక్స్‌ప్రెస్‌లు, వినుకొండకు చెందిన అల్ట్రాడీలక్స్‌లు, ఎక్స్‌ప్రెస్‌లు ఐదు చొప్పున నడుస్తాయి.
● 13వ తేదీ భోగి రోజున నాలుగు బస్సులు ఉంటాయి. వీటిలో నరసరావుపేట, వినుకొండలకు చెందిన అల్ట్రా డీలక్స్‌లు ఒక్కొక్కటి చొప్పున, మాచర్ల, చిలకలూరిపేటలకు చెందిన ఒక్కొక్క సూపర్ లగ్జరీ అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment