ఏటీఎం ధ్వంసం
నకరికల్లు: ఏటీఎంలో చోరీకి గుర్తుతెలియని దుండగులు విఫలయత్నం చేశారు. డబ్బు చోరీ చేసేందుకు వీలుపడకపోవడంతో ఏటీఎం పరికరాన్ని ధ్వంసం చేసి స్క్రీన్, కీబోర్డ్, ఇతర సామగ్రిని పగులగొట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి పక్కన అండర్‌పాస్ దగ్గర ఇండియా వన్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఏటీఎం వద్ద సెక్యూరిటీ ఎవరూ ఉండరు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రమే ఏటీఎం ఉంటుంది. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించి డబ్బును చోరీ చేసేందుకు యత్నం చేశారు. డబ్బును బయటకు తీయడం వీలు కాకపోవడంతో కంప్యూటర్ పరికరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. గతంలో కూడా ఇదే ఏటీఎంలో చోరీ జరిగింది. ఘటనపై శుక్రవారం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా సురేష్ తెలిపారు.
చోరీకి విఫలయత్నం
Comments
Please login to add a commentAdd a comment