నిధుల వినియోగంపై పాఠశాలల్లో సామాజిక తనిఖీలు
సత్తెనపల్లి: ప్రభుత్వ పాఠశాలలకు మంజూరు చేసిన నిధుల వినియోగం, ఖర్చులు, అవసరమైన మౌలిక వసతులు, చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై సామాజిక తనిఖీలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష అభియాన్ ఉన్నతాధికారులు జిల్లా విద్యా శాఖకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఏపీ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబులిటీ–ట్రాన్స్‌పరెన్సీ ఏపీ సాట్ ఆధ్వర్యంలో పాఠశాలల వారీగా సామాజిక తనిఖీలు, నిర్వహించాల్సిన విధి విధానాలపై షెడ్యూల్ జారీ చేసింది. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమా ఖర్చుల వివరాల పత్రాలు సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంది. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టేట్ రిసోర్స్ పర్సన్ పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి సోషల్ ఆడిట్ వింగ్ నుండి స్టేట్ రిసోర్స్ పర్సన్ ఎమ్.లోకేష్, జిల్లా రిసోర్స్ పర్సన్ బి.మహేష్ శుక్రవారం సంద ర్శించారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరు, తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గదుల అవసరం, పొందు పరిచేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురావడంతో వివరాలను పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. విద్యాభివృద్ధికి మంజూరు చేసిన నిధులు, వాటి ఖర్చులు వివరాలను సామాజిక తనిఖీలు ద్వారా గుర్తిస్తున్నారు. 2023–24, 2024– 25 విద్యా సంవత్సరాలకు సమకూర్చిన నిధుల వినియోగంపై తనిఖీ విభాగం అధికారులు లెక్కలు తేలుస్తు న్నారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన ఇరువురు బృందం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లతా ప్రియదర్శిని నుంచి వివరాలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment