రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
క్రోసూరు: మండలంలోని పీసపాడు గ్రామ శివారులో గురువారం రాత్రి రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగేంద్రరావు శుక్రవారం తెలిపారు. వివరాలు తెలుపుతూ సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్ల గ్రామానికి చెందిన కొల్లి లక్ష్మయ్య(45) సొంత పనులపై ద్విచక్రవాహనంపై క్రోసూరు వైపు వస్తూ పీసపాడు అడ్డరోడ్డు సమీపంలో గెదెలు తగిలి కింద పడిపోయాడు. తలకు దెబ్బతగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు కలరని, మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేయించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైల్వే పురస్కార గ్రహీతలకు అభినందన
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ముగ్గురికి జోనల్ స్థాయిలో 69వ రైల్వే వారోత్సవాల్లో విశిష్ట రైల్ సేవా పురస్కారాలు దక్కడంతో వారిని డీఆర్‌ఎం రామకృష్ణ అభినందించారు. గత నెల 31వ తేదీన సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులు కె.సీతారామయ్య, కె.హరిచంద్రుడు, కె.మల్లికార్జునరావులు ఈ అవార్డులు అందుకున్నారని గుర్తుచేశారు.
రైలు పట్టాలపై గాలిపటాలు ఎగురవేయొద్దు
విద్యుదీకరించిన రైల్వే లైన్ల వద్ద గాలిపటాలు ఎగురవేయడాన్ని నివారించాలని డీఆర్‌ఎం రామకృష్ణ తెలిపారు. రైలు పట్టాలపై ఉన్న ఓవర్ హెడ్ హైటెన్షన్ వైర్లు 25 వేల ఓల్టుల విద్యుత్‌ను సరఫరా చేస్తుంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment