ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు ధర
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ధర కన్నా అదనంగా లభిస్తుందని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో గురువారం సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. అమలకుమారి మాట్లాడుతూ గత సంవత్సరం జిల్లాలో 39,113 ఎకరాలలో 30 రకాల విత్తనాలు వేసి ఇంటి అవసరాలకు కొంత ఉపయోగించుకొని మిగిలినది భూమిలో కలియదున్నినట్టు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతునూ పీజీఎస్ గ్రూపులుగా ఏర్పాటు చేయడం ద్వారా వారి ఉత్పత్తులకు 15శాతం ఎక్కువ ధర లభిస్తుందన్నారు. ప్రతి రైతుకు మొదటి రెండు సంవత్సరాలు స్కోప్ సర్టిఫికెట్ ఇస్తారని, మూడో సంవత్సరం ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారని వివరించారు. దీంతోపాటు 5 నుంచి 15 ఎకరాల వరకు కాంపాక్ట్ బ్లాకులుగా ఏర్పాటు చేసి ఎటువంటి రసాయనాలు వాడని సర్టిఫికేట్ అందజేస్తారని తెలిపారు. రబీ పంటలైన వరి, మొక్కజొన్న, కూరగాయలు పలు పంటలు సాగు చేస్తున్న రైతులతో ఏ గ్రేడ్ మోడల్స్, ఏటీఎం మోడల్స్ వేయించాలని తెలిపారు. దీని ద్వారా ప్రతి నెల నిరంతర ఆదాయం లభించడం వలన రైతులు ఆర్ధికంగా బలోపేతం అవుతారని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తూ రబీ పంట సాగుచేసే ప్రతి రైతు వివరాలను ఉర్వి యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం ప్రేమ్‌రాజ్, జిలలా ఎన్‌ఎఫ్‌ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment