పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావును గెలిపించండి
క్రోసూరు: క్రోసూరు ఆమంచి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పీడీఎఫ్ అభ్యర్థి కె.ఎస్.లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూటీఎఫ్ జిల్లా నాయకులు బోళ్ళ నరసింహారెడ్డి మాట్లాడుతూ రైతు, కార్మిక , కర్షకుల సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి కె.ఎస్.లక్ష్మణరావును గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడారు. ఇప్పటివరకు ఎన్నికై న పీడీఎఫ్ ఎమ్మెల్సీలందరూ ప్రజా క్షేమానికి కృషి చేశారని వివరించారు. ఇకపైనా పనిచేసే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్డులనే గెలిపించాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు తిమ్మిశెట్టి.హనుమంతరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవిబాబు, ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు కె. ప్రకాష్ జి.రామాంజనేయులు, టీ. సౌరెడ్డి, ఏ.వెంకటేశ్వర్లు , నాయకులు జి.సురేష్ , సిఐటియు జిల్లా నాయకులు సూరిబాబు, చిన్నం పుల్లారావు, రైతు సంఘ నాయకులు రావెళ్ల.వెంకటేశ్వర్లు ,సయ్యద్ హుస్సేన్, టి.ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment