డాక్టర్లు, సిబ్బందికి మెమోలు జారీ చేయండి
వెల్దుర్తి: శిరిగిరిపాడు గ్రామంలోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కేవీ శివప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో పీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది లేకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేసి డాక్టర్లకు, సిబ్బందికి మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది పనివేళలు సక్రమంగా పాటించకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. హెల్త్ సెంటర్‌లో రికార్డులను పరిశీలించగా సరిగా లేవని వివరించారు. అనంతరం ఆయన గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ ఫేర్‌లో ప్రతిభ చాటి జిల్లా స్థాయికి ఎంపికై న విద్యార్థిని, ప్రోత్సహించిన టీచర్‌ను అభినందించారు. పాఠశాలలో నీటి సమస్య ఉందని టీచర్లు పీఓ దృష్టికి తీసుకురాగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈయన వెంట వసతి గృహం వార్డెన్ నాగేశ్వరరావు, టీచర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment