ప్రతికూలీంచిన పరిస్థితి | - | Sakshi
Sakshi News home page

ప్రతికూలీంచిన పరిస్థితి

Published Mon, Jan 20 2025 1:37 AM | Last Updated on Mon, Jan 20 2025 1:37 AM

ప్రతి

ప్రతికూలీంచిన పరిస్థితి

రొంపిచర్ల: రబీలో వరి సాగును కూలీల కొరత వేధిస్తోంది. దీంతో ఉత్తర ప్రదేశ్‌(యూపీ), బిహార్‌, బెంగాల్‌ నుంచి కూలీలను రైతులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మండలంలోని చాకలికుంట తండా, కొత్తపల్లి, ఎడ్వర్డ్‌పేట, రెడ్డిపాలెం, మర్రిచెట్టుపాలెం, దాసరిపాలెం, మాచవరం, విప్పర్ల గ్రామాల్లో దాళ్వా వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సార్వాలో కూడా ఈ గ్రామాల్లోని రైతులు ముందుగా వరి సాగు చేసి డిసెంబర్‌ నెలాఖరుకే వరి కోతలు, నూర్పిళ్ళు పూర్తి చేసి ధాన్యాన్ని ఇంటికి చేర్చుకున్నారు. డిసెంబర్‌ నెలలో దాళ్వా వరి నారుమళ్లు సాగుచేశారు. మండలంలో మిగిలిన గ్రామాల్లో ఈ తరుణంలో వరి హార్వెస్టింగ్‌ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో కూలీలకు మహా గిరాకీ ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఏక కాలంలో సార్వా వరి నూర్పిళ్ళు ముమ్మరంగా సాగుతుండగా మరి కొన్ని గ్రామాల్లో దాళ్వా వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే రైతులు 10 వేల ఎకరాలకు సరిపడా దాళ్వా వరి నారుమళ్లు సాగుచేశారు. కూలీల లభ్యత తక్కువగా ఉండడంతో నాట్లు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికి నాలుగు వేల ఎకరాల్లోనూ వరి నాట్లు పూర్తికాలేదు. వరి నారు యాతకు సిద్ధమై పరువం మించి పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జనవరి మొదటి వారంలో ఎకరా దాళ్వా వరి నాట్లు వేసేందుకు రూ.3,500 నుంచి రూ.4,000 వరకే ఖర్చు అయ్యేది. ఒక్కసారిగా రైతులందరికీ వరి నారు సిద్ధం కావటంతో కూలీలు అవసరం మేర అందుబాటులో లేరు. దీంతో ఉత్తరప్రదేశ్‌, బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించుకొని నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎకరా వరి నాట్లు వేసేందుకు కూలీలకు రూ.5 వేలు చెల్లించి వారికి వసతి, వంట చెరుకును కూడా రైతులు అందిస్తున్నారు. సార్వాలో వచ్చిన వరి దిగుబడులను కౌలు చెల్లింపులు పోను మిగిలిన ధాన్యాన్ని అమ్మి రైతులు దాళ్వా పెట్టుబడులకు ఖర్చు చేస్తున్నారు. దాళ్వాలో కూడా సార్వాలాగానే దిగుబడులు వస్తే వరి సాగు చేసిన వారికి కొంత ఆదాయం ఉంటుందని ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

వరినారు ముదిరితే దిగుబడి తగ్గుతుంది

దిగుబడి వరి నారు వయస్సుపై ఆధారపడి ఉంటుంది. తక్కువ రోజులో ఉన్న వరి నారును పొలంలో నాటితే ఎక్కువ పిలకలు వచ్చి అధిక దిగుబడి వస్తుంది. అందుకే సకాలంలో నాట్లు వేయాలని ఆత్రుత పడుతున్నాం. కూలీల కొరత వల్ల ఎక్కువ రేటు చెల్లిస్తున్నాం.

– సైదా సాహెబ్‌, రైతు, విప్పర్ల

కూలీలు దొరకడంలేదు

8 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. నారు పోశా. కూలీలు దొరకడంలేదు. నారు వయస్సు 30 రోజులు దాటుతుంది. కూలి రేట్లు పెరిగాయి. ఎకరా నాటు వేసినందుకు రూ.5 వేలు చెల్లించి, వసతి చూపించి, వంట చెరుకు చ్చి, పొలాలకు వెళ్లి వచ్చేందుకు ఆటో సౌకర్యం కల్పిస్తున్నాం.

– బండారు సైదయ్య, రైతు, విప్పర్ల

వరి నాట్లకు కూలీల కొరత

యూపీ, బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాల నుంచి కూలీలు వరి నారు వయస్సుపైనే ఆధార పడిన దిగుబడి

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రతికూలీంచిన పరిస్థితి1
1/3

ప్రతికూలీంచిన పరిస్థితి

ప్రతికూలీంచిన పరిస్థితి2
2/3

ప్రతికూలీంచిన పరిస్థితి

ప్రతికూలీంచిన పరిస్థితి3
3/3

ప్రతికూలీంచిన పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement