అద్దంకితో విడదీయలేని అనుబంధం
అద్దంకి రూరల్: అద్దంకితో తమ కుటుంబానికి ఉన్న బంధం విడదీయలేనిదని టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవరాలు సుభాషిణి అన్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా అద్దంకి వచ్చారు. స్థానిక బంగ్లా రోడ్డులోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన ముత్తాత ప్రకాశం పంతులుగారు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కావడం ఎంతో గర్వకారణమని తెలిపారు. తనకు ఏమీ ఉంచుకోకుండా దేశానికి అర్పించిన త్యాగధనుడని పేర్కొన్నారు. అద్దంకిలో ఆయన తిరిగిన ప్రదేశాలు, చదువు తదితర వివరాలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సుభాషిణి భర్త విజయశంకర్, సృజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకరదత్తు, జ్యోతిష్మతి, లెవీ ప్రసాద్, షేక్ మహమ్మద్ రఫీ, నరసింహారావు పాల్గొన్నారు.
ప్రకాశం పంతులు మునిమనవరాలు
Comments
Please login to add a commentAdd a comment