శుక్రవారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2025
పెదకూరపాడు: సమాచార హక్కు చట్టం 2005 మే 11వ తేదీన అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి, అక్రమాల నివారణ, సంక్షేమ పథకాల్లో అవకతవకలను నియంత్రించేందుకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతోంది. కానీ ఆయా కార్యాలయాల్లోని సమాచార హక్కు చట్టం బోర్డులు మచ్చుకై నా కనపడటం లేదు. ఈ బోర్డులో ఆయా కార్యాలయాల్లోని అిప్పీలేట్ అధికారి పేరు, ఫోను నెంబర్ పేర్కొనాల్సి ఉంటుంది. కానీ అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు. కొన్ని కార్యాలయాల్లో చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన బోర్డులే నేటికీ దర్శనమిస్తున్నాయి. కార్యాలయ అధికారి బదిలీ అయినపుడు ఆ స్థానంలో కొత్తగా వచ్చిన వారి పేరు, ఇతర వివరాలను మార్చకుండా అలాగే వదిలేస్తున్నారు. పెదకూరపాడు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్, మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, వెలుగు కార్యాలయం, ప్రాతీయ పశుసంవర్థక శాఖ కార్యాలయాల్లో అసలు దీనికి సంబంధించిన బోర్డులే లేవు. తహసీల్దార్ కార్యాలయంలో బోర్డు ఉన్నా సంబంధిత అధికారులు పేర్లు లేవు. ఉప ఖజానా కార్యాలయంలో, పెదకూరపాడు పంచాయతీ కార్యాలయంలో కూడా పాత అధికారుల పేర్లు ఉన్నాయి. అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, చట్టం అమలుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
కార్యాలయాల్లో బోర్డులపై కనిపించని అధికారుల వివరాలు
బొత్తిగా కానరాని సమాచార
హక్కు చట్టం నోటీసు బోర్డులు
ఉద్దేశపూర్వకంగానే ఏర్పాటు
చేయడం లేదని ఆరోపణలు
చట్టంపై అవగాహన కల్పించడంలోనూ
యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment