● ‘మన్నో’హర నమో..
రెండు లక్షల మట్టి శివలింగాల తయారీ ప్రారంభం
రెండు లక్షల మట్టి శివలింగాల తయారీ మహా యజ్ఞానికి సిద్ధమయ్యారు గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామ మహిళలు. స్థానిక ఆరిమండ కల్యాణ మండపంలో గురువారం నుంచి శివలింగాలు తయారు చేస్తున్నారు. తాళ్లాపాయపాలెంలోని కృష్ణస్వామి మహా శివరాత్రి సందర్భంగా కోటి శివలింగాలకు అభిషేకం చేయాలని సంకల్పించారు. దీనిలో భాగంగా శివపూజకు ఉపయోగించే మట్టిని 200 క్వింటాళ్లు కొల్లిపరకు పంపి రెండు లక్షల శివలింగాలు తయారు చేయాలని సూచించారు. దీంతో మహిళలు తయారీకి సిద్ధమయ్యారు. ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చని వివరించారు. – కొల్లిపర
Comments
Please login to add a commentAdd a comment