మార్చి 8 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి
నరసరావుపేట: కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటనతో జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి మార్చి ఎనిమిది వరకూ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తు.చ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల చిత్రపటాలు, నాయకుల ప్రకటనలతో ఉన్న క్యాలెండర్లను తొలగించాలన్నారు. కూడళ్లలో రాజకీయ నాయకుల విగ్రహాలకు నిబంధనల ప్రకారం ముసుగులు వేయాలన్నారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ముసుగులు వేయాల్సిన అవసరం లేదన్నారు. వెయ్యికి పైగా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన చేయాలన్నారు. డీఆర్వో మురళి, డీపీఓ భాస్కర్‌రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి సీహెచ్.వి.రమణారెడ్డి, జిల్లా పశు సంవర్థక అధికారి కె.కాంతారావు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల చిత్రపటాలు తొలగించాలి జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment