జిల్లాకు చేరుకున్న టెన్త్ స్టడీ మెటీరియల్
సత్తెనపల్లి: టెన్త్ విద్యార్థులకు అవసరమైన విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ఎట్టకేలకు జిల్లాకు చేరింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నప్పటికీ 58 రోజులు గడిచినా టెన్‌న్త్ విద్యార్థులకు అవసరమైన విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేయకపోవడంపై శుక్రవారం సాక్షిలో ‘స్టడీ మెటీరియల్ ఏది?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లకు అవసరమైన విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్‌ను శుక్రవారం సరఫరా చేశారు. సత్తెనపల్లి రెవెన్యూ డివిజనకు మొత్తం 5,101 విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ఉపవిద్యాశాఖాఽధికారి కార్యాలయానికి చేరుకున్నాయి. మిగిలిన వాటిని నరసరావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్‌లకు తరలించారు. ఒకటి, రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నేతృత్వంలో ఈ స్టడీ మెటీరీయల్‌ను టెన్త్ విద్యార్థులకు పంపిణీ చేసే కార్య క్రమాన్ని ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment