శ్రీకాకుళం రూరల్: మండలంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రి, బొల్లినేని మెడిస్కిల్స్‌లో ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు ఈ నెల 22న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18 నుంచి 20 ఏళ్లలోపు విద్యార్థినులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై నవారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.13,500 వేతనం అందుతుందని, అనకాపల్లి జిల్లా పరవాడలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే జాబ్‌మేళాకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
బస్సును ఢీకొట్టిన మరో బస్సు
● 15 మందికి గాయాలు
డెంకాడ: విజయనగరం–విశాఖ జాతీయ రహదారిపై డెంకాడ మండలంలోని మోదవలస సమీపంలో అనీల్‌నీరుకొండ ఆస్పత్రి బస్సును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్డడంతో పలువురికి గాయాలయ్యాయని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. బుధవారం ఉదయం అనీల్‌నీరుకొండ ఆస్పత్రికి చెందిన బస్సు విజయనగరం నుంచి తగరపువలస వైపు వెళ్తోంది. అదే వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొంది. దీంతో బస్సుల్లో ఉన్న 15 మంది వరకూ గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులను వెంటనే తగరపువలస వద్ద ఉన్న అనీల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు.
వ్యవసాయ విద్యుత్ మోటార్ల చోరీ
పూసపాటిరేగ : మండలంలోని చౌడువాడ పంచాయతీ కొణతాల పాలెం సమీపంలో గల వ్యవసాయక్షేత్రంలో మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు చోరీకి గురయ్యాయి. కొణతాల పాలెం సమీపంలో దన్నాన సత్యనారాయణకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో గల షెడ్‌లో గల మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సుమారు రూ.2 లక్షల విలువైన మోటార్లు చోరీకి గురవడంతో పోలీస్‌ష్టేషన్‌లో బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు.షెడ్ తలుపులు విరగ్గొట్టి దొంతనానికి పాల్పడినట్లు బాధిత రైతు ఫిర్యాదులో తెలియజేశాడు. ఇదే తరహాలో మండలంలోని పలు గ్రామాలులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ వైర్లు తరుచూ చోరీకి గురవుతూనే ఉన్నాయి.
పోక్సో కేసు నమోదు
విజయనగరం క్రైమ్: జిల్లాకేంద్రం విజయనగరం వన్‌టౌన్ పరిధిలో రెండో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి యత్నించాడు. ఈ ఘటనకు సంబంధించి విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు బుధవారం తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. వన్‌టౌన్ పరిధిలో ఉన్న ఓ స్కూల్‌కు రిక్షాలో రెండేళ్లుగా పాపను తీసుకువెళ్లి, తీసుకువచ్చే 56 ఏళ్ల వ్యక్తి మంగళవారం సాయంత్రం చిన్నారిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తున్న సమయంలో నిర్మానుష్య ప్రాంతానికి వచ్చేసరికి చిన్నారిపై లైంగికదాడికి యత్నిస్తుండగా స్థానికులు చూసి చితకబాది వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం నిందితుడిపై దిశ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
100 లీటర్ల బెల్లం ఊట
ధ్వంసం
రామభద్రపురం: మండలంలోని చందాపురం గ్రామ పరిధిలో బుధవారం ఎకై ్సజ్ సీఐ పి చిన్నంనాయుడు సిబ్బందితో కలిసి సారాబట్టీలపై దాడులు చేశారు. ఈ క్రమంలో 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా సారా తయారు చేసే నిర్వాహకులు, మద్యం దుకాణ యజమానులు బెల్టు షాపుల ఏర్పాటుకు ప్రోత్సహించినా, అక్రమంగా సరఫరా చేసిట్లు తనిఖీలలో గుర్తిస్తే ఆయా లైసెన్స్‌దారులపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు.
సారా స్థావరాలపై దాడి
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గల గంగన్నదొర వలస గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరంపై ఎస్సై నీలకంఠారావు సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేశారు.ఈ దాడుల్లో పులియబెట్టిన సుమారు 1000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి ప్లాస్టిక్ టబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా సారా, గంజాయి, మద్యం అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరిం చారు. అటువంటి సంఘటనలపై తమకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment