మత్స్య సంపద వృద్ధికి చర్యలు
● ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ
పార్వతీపురం: జిల్లాలో మత్స్య సంపద వృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పార్వతీపురం ఐటీ డీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని గురువారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర తీర ప్రాంతం మన రాష్ట్రంలోనే ఉందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా నదులు ఉండ డం వల్ల మత్స్య సంపద అవృద్ధికి అవకాశాలు అపారమన్నారు. స్థానికంగా ఉన్న జలవనరుల్లో చేపల పెంపకానికి మత్స్యకారులు మక్కువ చూపా లని కోరారు. మత్స్యకారులకు ఐటీడీఏ తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. తోటపల్లి రిజర్వాయర్ చుట్టూ నాలుగు మండలాలు ఉన్నాయని, రిజర్వాయిర్‌లో చేపలవేటకు అనుమతుల మంజూ రు కోసం సమగ్ర నివేదిక అందజేయాలని మత్స్య శాఖ అధికారికి సూచించారు. సీతంపేట ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ఆధ్వర్యంలోని చెరువులు, జల వనరుల్లో చేపల పెంపకానికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. కూలింగ్ బాక్స్‌లు కలిగిన స్కూటర్లు, ఫ్రిజ్ లు ఉన్న ఆటోలను రాయితీపై సమకూర్చుతామని చెప్పారు. మహిళలకు 50 శాతం యూనిట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. జిల్లా మత్స్య శాఖ అధి కారి వేముల తిరుపతయ్య మాట్లాడుతూ మత్స్యకార అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. పాలకొండ, సాలూరు డివిజన్‌ల మత్స్యశాఖ అధికారులు, పార్వతీపురం మత్స్యకార మహిళాసంఘ అధ్యక్షురాలు రాజు, ట్రై బల్ సంఘ నాయకుడు చిన్నారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment