●న్యాయం చేయండి
సీతంపేట: గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కోరారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐటీడీఏ ముఖద్వారం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజైన గురువారం కూడా కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే కళావతి దీక్షా శిబిరాన్ని సందర్శించిన సంఘీభావం తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 191 గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1633 మంది పని చేస్తున్నారని, వారందరినీ క్రమబద్ధీకరించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్.మోహనరావు, ఎన్.కాంతారావు, ఎస్.మహేష్, సర్పంచ్ ఎ.కళావతి, తదితరులు కూడా సంఘీబావం తెలిపారు. కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు బి.గణేష్, బి.ధర్మారావు, కె.భవానీ, కె.మహేష్, ఎస్.మోహన్, ఎల్.రవి, కె.బాలరాజు పాల్గొన్నారు.
రెండోరోజూ కొనసాగిన నిరాహార దీక్షలు
సంఘీభావం తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కళావతి
Comments
Please login to add a commentAdd a comment