విజయనగరం ఫోర్ట్: ఇందోగుల్ప్ క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ వారి బ్యాచ్‌నెం.ఎస్‌సీఏసీఎల్062401 ఈ గల క్లోరోఫైరిపాస్ 50 శాతం ఈసీ పురుగు మందు రీజనల్ కోడింగ్ సెంటర్ అమరావతి నందు నాసిరకం అని తేలిందని జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పురుగు మందును నిల్వ చేయడం, అమ్మడం నిషేధించారని రైతులు ఈ విషయాన్ని గమనించాలని, దీన్ని వాడరాదని సూచించారు.
జిల్లా సీనియర్ కబడ్డీ జట్ల ఎంపిక రేపు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న 71వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీ్త్ర, పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రంగారావుదొర, కెవి.ప్రభావతి శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు నగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పురుషులు 85 కేజీలలోపు, మహిళలు 75 కేజీలలోపు బరువు మించకూడదని స్పష్టం చేశారు. ఆ రోజు ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను డిసెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి 9949721949 నంబరును సంప్రదించాలని సూచించారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి...
విజయనగరం క్రైమ్: దళిత మహిళను ప్రేమించి, వివాహం చేసుకోవడానికి నిరాకరించి, మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు విజయనగరం డీఎస్పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గంట్యాడ మండలం కిర్తిబర్తి గ్రామానికి చెందిన శినగం వెంకట సత్యం ప్రస్తుతం బాపట్ల జిల్లా స్టూవర్ట్‌పురం వద్ద రైల్వే శాఖలో పాయింట్స్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఫ్యాకల్టీగా పని చేశాడు. అదే కళాశాలలో ఫ్యాకల్టీగా పని చేసే దళిత మహిళతో పరిచయం ఏర్పరచుకుని ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పి ఆమెను శారీరకంగా అనుభవించాడు. సదరు మహిళ వివాహం చేసుకోమని ఒత్తిడి చేయగా కులం పేరుతో దూషించి, వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై గంట్యాడ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసారని తెలిపారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి సదరు నిందితుడు పరారీలో ఉండగా, గురువారం అందిన సమాచారంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment