పల్లెల్లో జలంలేని జీవనం
సీతంపేట:
ఇంటింటికీ తాగునీరు సరఫరాయే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏజెన్సీలో చేపట్టిన జల్‌జీవన్ మిషన్ పనులు ప్రస్తుతం పడకేశాయి. కొన్నిచోట్ల నత్తనడకన సాగుతున్నాయి. వచ్చే వేసవికి కూడా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మన్యం వాసులు ఆవేదన చెందుతున్నారు. వేసవిలో బిందెడు నీటి కోసం మైళ్ల కొద్దీ నడక తప్పేలా లేదని బెంగపడుతున్నారు.
నెమ్మదించిన పనులు
గత వైఎస్సార్‌పీ ప్రభుత్వ హయాంలో పాలకొండ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో జేజేఎం పథకం కింద 505 పనులు మంజూరయ్యాయి. రూ.10.77 కోట్ల నిధులు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారడంతో పనులు నెమ్మదించాయి. ఇప్పటివరకు కేవలం 154 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 223 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నట్టు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు చెబుతున్నారు. 128 పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
●సీతంపేట ఏజెన్సీలో 326 పనులకు రూ. 1659.15 లక్షలు కేటాయించగా గతంలో పూర్తయి న 120 పనులే కనిపిస్తున్నాయి. 112 పనులు వివిధ దశల్లో ఉండగా, 94 చోట్ల పనులు ప్రారంభం కాలేదు.
●పాలకొండలో 48 పనులకు గాను రూ.839.41 నిధులు మంజూరయ్యాయి. వీటిలో 14 పూర్తి చేయగా 21 ప్రోగ్రెస్‌లో ఉండగా, 13 పనులు ప్రారంభం కాలేదు.
●వీరఘట్టంలో 53 పనులకు రూ.773.79 లక్షలు కేటాయించగా 6 పూర్తయ్యాయి. 38 వర్క్ ఇన్ ప్రో గ్రెస్‌లో చూపించారు. మిగతా 9 ప్రారంభించలేదు.
●భామినిలో 78 పనులకు 7506.73 నిధులు మంజూరయ్యాయి. 14 మాత్ర మే పూర్తిచేశారు. 52 పను లు జరుగుతున్నాయి. వీటి లో 12 ప్రారంభించలే దు. గ్రామాల్లో వేసిన పైప్‌లైన్ లు మాత్రమే దిష్టి బొమ్మ ల్లా దర్శనమిస్తున్నాయి. పనులు పూర్తిచేసేందుకు గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు చొర వ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా వేసవిలో తాగునీటి కష్టాలు ఎదుర్కో క తప్పదని గిరిజనులు వాపోతున్నారు.
పడకేసిన జల్‌జీవన్ మిషన్ పనులు నిధులున్నా ముందుకు సాగని వైనం
పైప్‌లైన్‌లే తప్ప నీరు సరఫరా కాని దుస్థితి
ఇంటింటికీ కుళాయిలు హుళక్కే
మన్యంలో తప్పని తాగునీటి కష్టాలు
రానున్న వేసవికి పూర్తికావడం కష్టమే!
పైప్‌లైన్‌లే కనిపిస్తున్నాయి
గ్రామాల్లో పైప్‌లైన్‌లే కనిపిస్తున్నాయి. మంచినీరు రావడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామమైన మోహన్‌కాలనీలో కూడా అదే పరిస్థితి. ఇంత నిర్లక్ష్యం వహించడం తగదు.
– ఎస్.మంగయ్య, చిన్నబగ్గ ఎంపీటీసీ
పాత పనులు పూర్తి చేసేందుకు చర్యలు
పాత పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ప్రారంభించి, బిల్లులు చెల్లించినవి ఉంటే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వాటిని పూర్తి చేస్తాం. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం మిగిలిన పనులు చేపడతాం.
– మధుసూదనరావు, డీఈ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ
పనుల్లో జాప్యం తగదు
గిరిజన గ్రామాలకు తాగునీటి సరఫరాకు గత ప్రభుత్వం కృషిచేసింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు కేటాయించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలైనా పనులపై దృష్టిసారించకపోవడం విచారకరం. ఏజెన్సీ గ్రామాల్లో శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. అధికారులు స్పందించి పనులు యుద్ధప్రాతిపదికన చేయాలి. రానున్న వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment