ఆలోచనలే ఆవిష్కరణలై..
● ఆకట్టుకున్న విజ్ఞాన ప్రదర్శన ప్రాజెక్టులు ● రాష్ట్రస్థాయి పోటీలకు ఐదు ప్రదర్శనలు ఎంపిక ● సైన్స్‌ఫెయిర్‌ను సందర్శించిన కలెక్టర్, డీఈఓ
పార్వతీపురంటౌన్: విద్యార్థులు సృజనకు పదునుపెట్టారు. ప్రాజెక్టుల రూపంలో మలిచారు. వాటిని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని డీవీవీఎం స్కూల్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన పోటీల్లో ప్రదర్శించారు. ప్రాజెక్టుల పనితీరు, వాటివల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా తెలియజేశారు. వీటిలో ఉత్తమంగా నిలిచిన ఐదు ప్రాజెక్టుల ను జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. పోటీలను స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. ముందుగా సర్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉండేప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. రానున్నది సాంతిక యుగంగా పేర్కొన్నారు. 15 మండలాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన 45 ప్రాజెక్టులను తిలకించి, పనితీరును తెలుసుకున్నా రు. జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎన్.తిరుపతి నా యుడు మాట్లాడుతూ దేశంలోని శాస్త్రవేత్తల జీవిత విశేషాలను విద్యార్థులకు తెలియజేసి, వారిలో స్ఫూర్తిని నింపి తద్వారా వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే విద్యా వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనల ఉద్దేశమన్నారు. మండలస్థాయిలో ఎంపిక చేసిన ప్రాజెక్టులను జిల్లా స్థాయిలో ప్రదర్శించినట్టు వెల్లడించారు.
త్వరలో పార్వతీపురంలో ఇన్నోవేషన్ హబ్
నీతి అయోగ్ ప్రకటించిన ర్యాంకింగుల్లో ఆశావాహ (యాస్పిరేషనల్) జిల్లాగా పార్వతీపురం నిలిచినందున రూ.3 కోట్లు నిధులు విడుదలయ్యాయని, ఆ నిధులతో త్వరలో పార్వతీపురంలో ఇన్నోవేషన్ హబ్‌ను నిర్మించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఫిజిక్స్, మ్యాథ్స్, ప్లానిటోరియం వంటివి ఏర్పాటుచేస్తామని, ఇవి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. సైన్స్ ఫెయిర్‌లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయాధికారి ఆర్.తేజేశ్వరరావు, ఉప విద్యాశాఖాధికారులు డి.రాజ్‌కుమార్, పి.కృష్ణమూర్తి, డీసీసీబీ సెక్రటరీ శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు ఎం.రమాజ్యోతి, పి.దామోదరరావు, కౌన్సిలర్ వెంకటినాయుడు, డీవీవీఎం పాఠశాల హెచ్‌ఎం గోవిందరావు, ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు
●విద్యార్థి వ్యక్తిగత విభాగం: టి.చరణ్‌సాయి (9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, మార్కొండపుట్టి.
గైడ్‌టీచర్ టి.పద్మలత (రూమ్ వార్మర్ ప్రాజెక్టు), ఎ.రిషి (9వ తరగతి) జెడ్పీహెచ్‌ఎస్, కంబవలస,
గైడ్ టీచర్–ఎ.వెంకటరావు
●విద్యార్థి గ్రూపు విభాగం: డి.నితిన్‌కుమార్ (10వ తరగతి), పి.గోవిందరావు (9వ తరగతి) జెడ్పీహెచ్ స్కూల్, తలవరం, పి.గౌతమ్ (10వ తరగతి), జి.పార్థసారథి (8వ తరగతి), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం, సీతానగరం
●టీచర్ వ్యక్తిగత విభాగం: సీహెచ్ స్వర్ణలత, ఎంపీయూపీ స్కూల్, గోపాలపురం (పాలకొండ)
డి. ప్రసన్న కుమార్, జెడ్పీహెచ్‌ఎస్, మామిడిపల్లి (సాలూరు)
Comments
Please login to add a commentAdd a comment