ఒడిశాలో భలే డిమాండ్
ఏజెన్సీ గుమ్మడికి
సీతంపేట: ఏ శుభకార్యానికై నా గుమ్మడి తప్పనిసరి. సీతంపేట ఏజెన్సీలో గుమ్మడి కాయల సీజన్ ఆరంభమైంది. సంక్రాంతి పండగకు తప్పనిసరిగా దీని అవసరం ఉండడంతో ఇప్పుడిప్పుడే ఏజెన్సీ వారపు సంతల్లో గిరిజనులు విక్రయిస్తున్నారు. ఒడిశాలో ఎక్కువ డిమాండ్ ఉండడంతో అక్కడి వ్యాపారులు వచ్చి గుమ్మడి కాయలు కొనుగోలు చేస్తు న్నారు. ఏజెన్సీలో సుమారు 200 ఎకరాల్లో గుమ్మడి పంటను సాగుచేశామని, ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని, ఒక్కోకాయ/పండు సైజును బట్టి రూ.40 నుంచి రూ.50 పలుకుతోందని గిరిజన రైతులు చెబుతున్నారు. సీతంపేట, మర్రిపాడు, కుశిమి, పొల్లలో జరిగే వారపు సంతలకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశాకు చెందిన వ్యాపారులు వచ్చి గుమ్మడి పంటను కొనుగోలుచేస్తున్నారన్నారు.
పండగ సీజన్‌లో వారపు సంతల్లో విక్రయం
సైజును బట్టి రూ.40 వరకు అమ్మకం
200 ఎకరాల్లో పంట సాగు
ప్రస్తుతానికి ధర గిట్టుబాటవుతోంది
గుమ్మడి కాయలను కొండలపై నుంచి మోసుకుంటూ సంతలకు తరలిస్తున్నారు. సీజన్ ఆరంభంలో ధరలు బాగున్నాయి. చివరి వరకు ఇవే ధరలు ఉంటే రైతుకు లాభమే. సీజన్ మధ్యలో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుకు ధర లేకుండా చేస్తున్నారు.
– ఎస్.జోషి, అడ్డంగి
Comments
Please login to add a commentAdd a comment