తల్లికి వందనం అమలెప్పుడు?
పాలకొండ: తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలుచేస్తారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే పాలవలస విక్రాంత్ ప్రశ్నించారు. పాలకొండలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున అందజేస్తామని చెప్పి జాప్యం చేయడం తగదన్నారు. క్యాబినెట్ సమావేశంలో తల్లికి వందనంపై ఎటువంటి నిర్ణయం ప్రకటించక పోవడం దారుణమన్నారు. సమావేశంలో మండల కన్వీనర్ కనపాక సూర్యప్రకాశ్‌రావు, పార్టీ నాయకులు నల్లి శివప్రసాద్, లోలుగు విశ్వేశ్వరరావు, కోట అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
Comments
Please login to add a commentAdd a comment