మస్కా!
–8లో
ఇసుక టెండర్‌లో
కార్మికుల నిరసన ఉద్రిక్తం
‘కార్మికుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో చీపురుపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు.
● పేరుకే ప్రక్రియ..
● టీడీపీ నేత అనుచరునికి కట్టబెట్టేందుకు యత్నం
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం టౌన్: జిల్లాలో మూడు ఇసుక రీచ్‌లలో మనుషులతో తవ్వకాలకు అనుమతి కోసం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ ఏకపక్షమవుతుందా.. టీడీపీ నేత అనుచరునికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భామిని మండలం నేరడి, పసుకుడి, పాలకొండ మండలం చిన మంగళాపురం రీచ్లకు సంబంధించి సంయుక్త కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక సమక్షంలో గత శనివారం కలెక్టరేట్లో టెండర్ డబ్బాలకు సీల్ వేయించారు. టెండర్లు వేసేందుకు ఈ నెల 3వ తేదీ వరకూ అవకాశం ఇచ్చారు. ఆసక్తి గల టెండర్ దారులు రూ.10వేలు డీడీని తీసి కలెక్టర్ కార్యాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో టెండర్లు వేయవచ్చని చెప్పారు. ఇదంతా అధికారిక ప్రక్రియే. తెర వెనుకే జరగాల్సింది జరిగిపోయింది. ఎవరినీ టెండర్లు వేయకుండా ముందే కూటమి నేతలు చక్రం తిప్పారు. తన తమ్ముడికి టెండర్ కట్టబెట్టేందుకు కూటమికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పావులు కదిపారు. గడువు ముగిసే సమయానికి విశాఖ, రాజమండ్రిలకు చెందిన వ్యక్తుల నుంచి కేవలం రెండే రెండు దరఖాస్తులు రావడం గమనార్హం. ఇందులో కూడా సింగిల్ టెండర్ ద్వారా ర్యాంపును కట్టబెట్టేందుకు రాజకీయ ఒత్తిడి మొదలైంది. ఇది కాస్త వివాదమైంది. శనివారం టెండర్ బాక్సులు తెరిచారు. రాజకీయ ఒత్తిళ్లతో తొలుత ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసినట్టు అధికారులు చెప్పారు. రెండో పార్టీ అభ్యంతరం చెప్పడంతో మధ్యాహ్నం సమయానికి వాయిదా వేశారు. మళ్లీ ఏమైందో ఏమో గానీ.. వచ్చే సోమవారం తెరుస్తామని చెప్పి అధికారులు అక్కడ నుంచి జారుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment