హైబ్రిడ్ విధానంలో ప్రజాభిప్రాయ సేకరణ
పార్వతీపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ కోడా చలపతిరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 7, 8, 10 తేదీల్లో మూడు రోజుల పాటు పార్వతీపురం, పాలకొండ డివిజన్ కార్యాలయాలలో హైబ్రిడ్ విధానంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని ఆయన చెప్పారు. జనవరి 7, 8 తేదీలలో విజయవాడ బృందావన్ కాలనీ 2ఎ’ కన్వెన్షన్ సెంటర్ నుండి జనవరి 10వ తేదీన కర్నూలు కమిషన్ ఆఫీస్ నుండి ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యక్ష హాజరు ద్వారా, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారని తెలిపారు. మూడు రోజల పాటు జరిగే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ నియంత్రణ మండలి ప్రతి రోజు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తుందన్నారు. ఈ ధరలపై సందేహాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వినియోగదారులు పాల్గొనవచ్చునన్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌కు స్థానిక విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయములో ఎస్‌ఈ ఆఫీస్ లేదా ఏదైనా విద్యుత్ డివిజనల్ కార్యాలయంలో ఈ.ఈ. ఆఫీస్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. ప్రతి రోజు ముందుగా నమోదు చేసుకున్న వినియోగదారుల అభ్యంతరాలు విన్న తరువాత విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితో నమోదు చేసుకొని వినియోగదారుల అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment