అరుంధతి సూక్ష్మ రుణ పథకం
బ్రాహ్మణ మహిళల సాధికారతకు, ఉపాధి పొందేందుకు ముగ్గురు సభ్యులకు గరిష్టంగా రూ.45వేల రుణం ఇస్తారు. సకాలంలో రుణం చెల్లిస్తే రుణమొత్తం రూ.75 వేలు, రూ.ఒకలక్ష, రూ.1.50లక్షలు, రెండు లక్షలు, రూ.2.50లక్షలుగా పెంచుతారు.
వశిష్ట సూక్ష్మ రుణ పథకం
బ్రాహ్మణ పురుషుల స్వయం ఉపాధి కోసం ముగ్గురు కలిపి ఒక గ్రూపుగా రుణం అందిస్తారు. ఇది కూడా అరుంధతి పద్ధతిలో రుణాలు ఇస్తారు.
అర్చక మిత్ర పథకం
వివిధ దేవాలయాల్లో పే స్కేల్‌పై పనిచేస్తున్న అర్చకులకు 18 నెలల గ్రాస్ శాలరీ గరిష్టంగా రూ.10 లక్షలు..ఏది తక్కువ అయితే వారి రుణ అర్హతను బట్టి 10.5శాతం వడ్డీతో వ్యక్తిగత రుణం ఇస్తారు.
పురోహిత పథకం
నలుగురు పురోహితులకు రూ.1.60 లక్షల రుణం 24నెలల్లో చెల్లించే పద్ధతిలో ఇస్తారు. అలాగే బ్రాహ్మణ ఎంప్లాయీస్, బిజినెస్, ఆస్తి తనఖా, బంగారు అభరణాలు, ప్రాజెక్ట్ ఫైనాన్స్, ఉన్నత విద్య తదితర రుణాలు అందిస్తూ బ్రాహ్మణులకు సొసైటీ సహాయపడుతోంది. వృత్తి నిపుణుల రుణ పథకంలో భాగంగా సమాచార మిత్ర, ఆచార్యమిత్ర, పథకాలు అందిస్తోంది. జర్నలిజం రంగంలో ఉన్నవారికి వ్యక్తిగతంగా ఏభైవేల రూపాయల రుణం ఇస్తోంది. ఆ రుణాన్ని 24నెలల్లో జమ చేయాల్సి ఉంది. ఆచార్యమిత్ర అంటే ప్రైవేట్ ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న వారికి రుణం అందిస్తోంది. ఇలా బ్రాహ్మణులకు అన్నివిధాలా సొసైటీ సహకారం అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment