హెచ్‌ఎంపీవీపై అవగాహనే ప్రధానం
వీరఘట్టం: హెచ్‌ఎంపీవీ వైరస్‌పై పల్లె, పట్టణ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు ఆశ కార్యకర్తలను ఆదేశించారు. బీటీవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆశ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చైనాలో గుర్తించిన కొత్త వైరస్ హెచ్‌ఎంపీవీ కేసులు మన రాష్ట్రంలో ఎక్కడా నమోదుకాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వైరస్ ప్రభావం ఉంటుందని, ఇది సాధారణ ఫ్లూ/జలుబు లాంటిదేనని, వైరస్ సోకిన వారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపరలు, వారితో సన్నిహితంగా మెలగడం, కరచాలనం, స్పర్శ వంటి చర్యలతో వైరస్ వ్యాపిస్తుందని పేర్కొన్నారు. వైరస్ సోకిన తర్వాత 3 నుంచి 10 రోజులకు లక్షణాలు బయట పడతాయని తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్‌బీఎస్‌కే అండ్ ఎన్సిఫీల్డ్ సర్వే వేగవంతం చేయాలన్నారు. అనంతరం రికార్డులు, మందుల స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి ఎం.వినోద్‌కుమార్, వైద్యాధికారులు ఎ.మానస, ఎస్.నితీష, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు
Comments
Please login to add a commentAdd a comment