పంట రుణాల మంజూరుపై అవగాహన కల్పించాలి
పార్వతీపురం: రానున్న ఖరీఫ్‌కు రూ.లక్షలోపు వడ్డీలేని పంట రుణాలు అందించే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకు, పలు శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ సీజన్ 2024–25కు రైతులు పంట బీమా ప్రీమి యం చెల్లించాలన్నారు. ఖరీఫ్ 2023 సంవత్సరానికి తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించిన రైతుల వివరాలు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం కింద యువత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక ఊతమివ్వాలన్నారు. పీఎం స్వానిధి, మత్స్యకారులు, వీధి వ్యాపారులకు రుణాలు, ముద్ర రుణాలు మంజూరులో కొన్ని బ్యాంకులు వెనుకబడి ఉన్నాయని, త్వరితగతిన లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్ స్వరూప్, డీసీసీబీ బ్యాంక్ సీఈఓ ఉమామహేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీరామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment