అటవీ ఉత్పత్తులకు జీసీసీ ధరల ప్రకటన | - | Sakshi
Sakshi News home page

అటవీ ఉత్పత్తులకు జీసీసీ ధరల ప్రకటన

Published Sun, Jan 5 2025 12:40 AM | Last Updated on Sun, Jan 5 2025 12:41 AM

అటవీ ఉత్పత్తులకు  జీసీసీ ధరల ప్రకటన

అటవీ ఉత్పత్తులకు జీసీసీ ధరల ప్రకటన

సీతంపేట: గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నూతన ధరలు ప్రకటించినట్టు బ్రాంచ్‌ మేనేజర్‌ దాసరి కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీసీసీ డివిజనల్‌ మేనేజర్లతో మేనేజింగ్‌ డైరెక్టర్‌ జూమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి నూతన ధరలు ఖరారు చేసినట్టు పేర్కొన్నారు.

భోజన పథకం పేద విద్యార్థులకు ఉపయోగకరం

సాలూరు: మధ్యాహ్న భోజన పథకం పేద విద్యార్థులకు ఉపయోగకరమని సీ్త్రశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌తో కలిసి ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నాటికి బాలికల జూనియర్‌ కళాశాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విద్యార్థులకు మంత్రి, కలెక్టర్‌తో పాటు సబ్‌కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ స్వయంగా భోజనం వడ్డించడంతో పాటు సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీవీఈఓ మంజులవీణ, ఎంఈఓ రాజకుమార్‌, ప్రిన్సిపాల్‌ పాల్గొన్నారు.

లాకర్‌లో 30 తులాల

ఆభరణాలు మాయం?

ఏపీజీవీబీ జనరల్‌ మేనేజర్‌, ఆర్‌ఎం, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు

బొబ్బిలి: స్థానిక ఏపీజీవీబీ శాఖ లాకర్‌లో దాచుకున్న 30 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బొబ్బిలి నాయుడు కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు ఆర్నిపల్లి నాగభూషణరావు, తులసి దంపతులు లబోదిబోన్నారు. బ్యాంకు జీఎం, ఆర్‌ఎం, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 తులాల బరువున్న 19 ఆభరణాలను గత 14 ఏళ్లుగా వినియోగిస్తున్న ఏపీజీవీబీ బ్యాంకు లాకర్‌లో భద్రపరిచాం. ఇటీవల వాటిని పరిశీలించేందుకు వెళ్లగా అందులో ఒక్క వస్తువు కూడా కనిపించలేదు. దీనిపై బ్యాంకు మేనేజర్‌ అప్పలనాయుడును ప్రశ్నించాం. బ్యాంకులోని లాకర్‌ స్పేస్‌ను మాత్రమే ఇస్తామని, అందులో భద్రపరిచిన ఏ వస్తువైనా మీదే బాధ్యతని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో బయటపడుతుందని సమాధానం ఇచ్చారు. దీంతో ఏపీజీవీబీ జనరల్‌ మేనేజర్‌, రీజనల్‌మేనేజర్‌తో పాటు బొబ్బిలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నాగభూషణం, తులసి చెప్పారు. ఇదే విషయంపై బ్యాంకు మేనేజర్‌ నాయుడు మాట్లాడుతూ వారు వినియోగించుకున్న లాకర్‌లో వస్తువులు పోయాయని ఫిర్యాదుచేశారని, ఇది ఎలా జరిగిందో తెలియదన్నారు. వారే మరో సారి చెక్‌ చేసుకోవాలని చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ జరుపుతామని సీఐ కె.సతీష్‌కుమార్‌ తెలిపారు. నాగభూషణరావు స్వగ్రామం రామభద్రపురం మండలంలోని నాయుడువలస కాగా, ఉపాధ్యాయ వృత్తి రీత్యా బొబ్బిలిలో నివసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement