ఘనంగా పెదపోలమాంబ తొలేళ్ల ఉత్సవం
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మేనత్త పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్లు ఉత్సవం సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముందుగా చదురుగుడి నుంచి పెదపోలమాంబ అమ్మవారి ఘటాలను గ్రామంలో తిరువీధి జరిపారు. అనంతరం ప్రధానవీధిలోని అమ్మవారి గద్దెవద్ద ఘటాలకు పూజలు చేసి తొలేళ్లు ఉత్సవం నిర్వహించారు. మంగళవారం పెదపండగ నిర్వహించి, బుధవారం పెదపోలమాంబ అమ్మవారు అనుపోత్సవం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అదేరోజు శంబరపోలమాంబ అమ్మవారిని కొనితెచ్చేందుకు చాటింపు వేస్తామన్నారు. తొలేళ్లు ఉత్సవంలో పూజారి కుటుంబీకులు, రెవెన్నాయుడులు, గ్రామపెద్దలు, మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్లు, దేవదాయశాఖ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సినీఫక్కీలో దొంగతనం
పూసపాటిరేగ: మండలంలోని పాత కొప్పెర్ల కూడలి సమీపంలో జాతీయరహదారిపై అగంతుకులు ఓ మహిళ పుస్తెలతాడు, సెల్‌ఫోన్‌ను సినీఫక్కీలో దొంగిలించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పూసపాటిరేగ మండలం గుంపాంకు చెందిన మహంతి శ్రీనివాసరావు, రాజేశ్వరి దంపతులు సోమ వారం ఉదయం షాపింగ్ కోసం విజయనగరం వెళ్లారు. తిరిగి వస్తుండగా.. రాత్రి 8 గంటల ప్రాంతంలో నాతవలస దాటుతుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌తో వెంబడించారు. బైక్ చక్రంలో లగేజీ అడ్డు పడిందంటూ దంపతులకు చెప్పా రు. వెంటను వారు మోటారు బైక్‌ను పక్కకు నిలిపి చూసేలోగా అగంతుకులు దంపతులు వద్దకు వెళ్లి బంగారం పుస్తెలతాడు, సెల్‌ఫోన్ లాక్కొని పరారయ్యారు. అగంతుకులు విని యోగించిన బైక్‌కు నంబర్ ప్లేట్‌లు లేవని బాధితులు తెలిపారు. పూసపాటిరేగ ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.
● బైక్‌పై వెళ్తున్న జంటను అటకాయింపు
● పుస్తెలుతాడు, సెల్‌ఫోన్ చోరీ
Comments
Please login to add a commentAdd a comment