2014 ఎన్నికల సమయంలోనూ చేనేత కార్మికులను ఆదుకుంటాం.. రెండు నెలల జీవన భృతితో పాటు వంద యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. విరామ సమయంలో మత్స్య కారులకు ఇచ్చే విధంగా వర్షా కాలంలో రెండు నెలల పాటు పనులు కోల్పోయిన చేనేత కార్మికులకు నెలకు రూ.2 వేలు చొప్పున రూ.4 వేలు ఒక్కో కార్మికునికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. వస్త్రాల నేతకు ప్రత్యేక షెడ్లు, త్రిప్టు పథకం అమలు చేసి ఆదుకుంటామని వరాల జల్లు కురిపించి మోసం చేశారు. 2024లోనూ ఆయన హామీలను నమ్మి మరోసారి మోసపోయామంటూ చేనేత కార్మికులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment