చేనేత కార్మికులను ఆదుకోవాలి
నేతన్నలకు ప్రస్తుతం పూటగడవం కష్టంగా మారింది. ప్రభు త్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదు. వస్త్రాల నేత కూడా గిట్టుబాటు కావడంలేదు. గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన విధంగా నెలకు రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేసి చేనేత కార్మికులను ఆదుకోవాలి. ఎన్నికల హామీలను చిత్తశుద్ధితో అమలుచేయాలి. చేనేత కార్మికులకు వర్కుషెడ్లు నిర్మించాలి.
– నాగులపల్లి లక్ష్మణ, చేనేత కార్మికుడు, రొంపల్లి
బాబూ.. ఆదుకోండి..
కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఇచ్చిన మాట ప్రకారం 250 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇచ్చి, అర్హులైన వారికి గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను అమలుచేసి ఆర్థికంగా ఆదుకోవాలి. చేనేత మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ ఇవ్వడంతో పాటు, 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ రెట్టింపు చేయాలి.
– కె.శ్రీనివాసరావు, శ్రీ ఉమామహేశ్వర చేనేత సహకార సంఘం మేనేజర్, కోటగండ్రేడు
●
Comments
Please login to add a commentAdd a comment