ఉపాధ్యాయులపై ఎందుకంత కోపం..
చీపురుపల్లి: అయ్యా.. జిల్లా, రాష్ట్ర నాయకులు ఏం చేస్తున్నారు..? నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారేంటి సార్... ఈ రోజు నాలుగో తేదీ.. ఇంతవరకు జీతా లు పడలేదు. సంక్రాంతి పండగ ఉన్నా జీతాలు వేయలేదు. ఈ ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నందుకు ఇది గిఫ్టా... మీరంతా ఏం చేస్తున్నారు..? అన్ని డిపార్ట్‌మెంట్లకు జీతాలు జమచేసి ఉపాధ్యాయులపై మాత్రమే ఎందుకంత కోపం.. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుంది... అంటూ ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు వాయిస్ మెసేజ్‌ను వాట్సాప్ గ్రూపుల్లో పంపడంతో జిల్లాలో వైరల్‌గా మారింది. అక్కడితో ఆగకుండా సదురు ఉపాధ్యాయ సంఘ నాయకుడు ఓ జనసేన నాయకుడికి ఫోన్ చేసి కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకేనా మాపై కక్ష కట్టారా అంటూ, గురువులను గౌరవించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారని ఇదేనా గౌరవం అంటూ నిలదీసిన వాయిస్ మెసేజ్ కూడా ఉపాధ్యాయ సంఘ వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేసింది.
ఉపాధ్యాయుల్లో పెరుగుతున్న అసంతృప్తి
నాలుగో తేదీ దాటుతున్నా జీతాలు అందకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర స్థాయిలో అసహనం పెరుగుతోంది. ఉపాధ్యాయులతో బాటు సంఘాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. పండగ పూట ఇలా సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఎలా అంటూ ఉపాధ్యాయులు లోలోపల మదనపడుతున్నారు. చీపురుపల్లి కేంద్రంగా ఒక ఉపాధ్యాయుడు, సంఘ నాయకుడు వాయిస్ మెసేజ్ పెట్టినప్పటికీ అదే ఆవేదన అందరిలోనూ ఉందంటూ చర్చ సాగుతోంది.
ఏరి కోరి తెచ్చుకున్నందుకేనా....
నాలుగో తేదీ దాటినా జీతాలు ఇవ్వరా
జిల్లా, రాష్ట్ర నాయకులు ఏం చేస్తున్నారు?
ఉపాధ్యాయ సంఘ వాట్సాప్ గ్రూపుల్లో వాయిస్ మెసేజ్‌లు
ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్న గురువులు
Comments
Please login to add a commentAdd a comment