జిల్లెళ్లమూడి అమ్మ స్ఫూర్తితో..
మొదట్లో రెండు, మూడు రోజులు అనుకుని అన్నదానం చేపట్టాం. పేదల ఆకలి తీర్చడంలో చాలా తృప్తి అనిపించింది. జిల్లెళ్లమూడి అమ్మ స్ఫూర్తితో దీనిని కొనసాగించాలని నిర్ణయించి.. ఇప్పటికి 1,247 రోజులుగా నిరాటంకంగా కొనసాగిస్తున్నాం. మున్ముందు కూడా కొనసాగుతుంది.
– బి.శ్రీరామ్మూర్తినాయుడు,
విశ్రాంత ఉపాధ్యాయుడు
పేదల ఆకలి తీర్చడంలో
ఎనలేని తృప్తి
మూడేళ్లకుపైగా జిల్లా ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులకు భోజనం ప్యాకెట్లు అందిస్తున్నాం. రోజుకు 120 మందికిపైగా అందజేస్తున్నాం. ఎంతోమందికి ఉపయోగపడే కార్యక్రమం తలపెట్టామన్న తృప్తి చాలా ఆనందాన్నిస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత ఇదో బాధ్యతగా పని చేస్తున్నాం. – గొర్లె అప్పలరాజు,
విశ్రాంత డిప్యూటీ తహసీల్దారు
చదువుల తల్లి
రుణం తీర్చుకుంటున్నాం..
మేం చదువుకున్న కళాశాల, అక్కడ అందరికీ అన్నం పెట్టే అమ్మ రుణం తీర్చుకునేలా నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేపట్టడం ఆనందంగా ఉంది. అప్పటి మా ప్రిన్సిపల్ రామచంద్రమూర్తి సూచనతో మొదట్లో ఒక సేవా కార్యక్రమంగానే ప్రారంభించాం. అది ఇంత వరకూ వస్తుందని ఊహించలేదు. – గంటేడ సోమేశ్వరరావు,
విశ్రాంత ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment