వారు ఓసీలా..!
వీరఘట్టం: వర్గీకరణ కోసం ఎస్సీ ఉపకులాల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో తెలుసుకోవడానికి రూపొందించిన యాప్ తప్పుల తడకగా ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలో ఉందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది. ఎస్సీల్లో మాల, మాదిగ, రెల్లి తదితర 59 ఉపకులాల వారు రాష్ట్రంలో ఉన్నారు. వారిలో ఏయే శాఖల్లో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో తెలుసుకునేందుకు కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో తొలుత ఉపాధ్యాయ వర్గాల్లో ఎస్సీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు ‘టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టిమ్’ అనే యాప్ ద్వారా వారి వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఈ యాప్‌లో మాల, మాదిగ, ఇతర ఉపకులాల టీచర్లు తమ వివరాలు నమోదు చేస్తుంటే ఆ వివరాలు సక్రమంగానే నమోదవుతున్నాయి. కానీ రెల్లి సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రం ఈ యాప్‌లో ఓసీ క్రిస్టియన్‌గా చూపిస్తుండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
సాంకేతిక సమస్య ఉంది
టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టిమ్ యాప్‌లో రెల్లి ఉపకులాల ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేస్తుంటే ఫైనల్‌గా వారిని ఓసీ క్రిస్టియన్ అని చూపిస్తున్నట్లు పలువురు ఉపాధ్యాయులు తెలిపారు.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగి ఉండవచ్చని రెండు లేదా మూడు రోజుల్లో యాప్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
–ఎన్.తిరుపతినాయుడు, డీఈఓ,
పార్వతీపురం మన్యం జిల్లా
టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో వెరిఫికేషన్ చేస్తే సబ్ కేస్ట్ వద్ద ఓసీ క్రిస్టియన్ అని
చూపిస్తున్న చిత్రం
తప్పులతడకగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
వర్గీకరణ నేపథ్యంలో ఎస్సీ ఉద్యోగుల వివరాలు కోరుతున్న ప్రభుత్వం
రెల్లి సామాజిక వర్గానికి చెందిన వారిని ఓసీ క్రిస్టియన్‌గా చూపిస్తున్న యాప్
ఆందోళన చెందుతున్న ఆ సామాజిక వర్గం ఉపాధ్యాయులు
Comments
Please login to add a commentAdd a comment