7న పాలకొండలో మినీ జాబ్‌మేళా
పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధికల్పన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పాలకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధికల్పనలో భాగంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ చదువుకుని, 18నుంచి 32 ఏళ్ల వయస్సున్న నిరుద్యోగ యువత ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల యువత హెచ్‌టీటీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్ నంబర్‌తో బయోడేటా, ఆధార్‌కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు పాస్‌పోర్ట్ సైజ్‌ను తీసుకుని జాబ్‌మేళాకు ఉదయం 9 గంటలకు హజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 63012 75511 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
కళ్లికోటకు చేరుకున్న ఏనుగుల గుంపు
కొమరాడ: గడిచిన నెలరోజులుగా గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో సంచిరిస్తున్న ఏనుగుల గుంపు ఆదివారం కొమరాడ మండలంలోని కళ్లికోట, గారవలస గ్రామ సమీపంలోకి చేరుకుంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కూరగాయల సాగు ఎక్కువగా ఉండడంతో చేతికివచ్చిన టమాటో, అరటి తదితర కూరగాయల పంటలతోపాటు జొన్న, కళ్లాల్లో ఉన్న ధాన్యం ధ్వంసం చేస్తాయోమోనన్న భయంతో ఉన్నారు. ఏనుగుల గుంపును తరలించడంపై అటవీశాఖాధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టిసారించి కొండ ప్రాంతాల వైపు ఏనుగుల గుంపును తరలించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
జాబ్‌మేళాను
సద్వినియోగం చేసుకోండి
● మంత్రి సంధ్యారాణి
సాలూరు: జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకుని తద్వారా యువత ఉపాధి మార్గాలను సుగమం చేసుకోవాలని సీ్త్రశిశుసంక్షేమ,గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో నిర్వహించిన మెగాజాబ్‌మేళాలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందరం్భంగా మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.ఈ జాబ్‌మేళాలో సుమారు 25 ప్రముఖ కంపెనీలు ఇంటర్వూలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ సాయికృష్ణచైతన్య, కళాశాల ప్రిన్సిపాల్ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఐటీఐలో
జాబ్‌మేళా రేపు
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, గవర్నమెంట్ ఐటీఐ కళాశా ల విజయనగరం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన స్థానిక ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ టీవీ గిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధికల్పనలో భాగంగా ఎస్‌ఎస్ సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ డిప్లమో, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన 35 సంవత్సరాల వయసులోపు ఉన్న నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు. జాబ్ మేళాలో సేఫ్ డ్రైవ్ ప్లస్, హెటిరోడ్రగ్స్ తదితర బహుళ జాతి కంపెనీలు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు తమ వివరాలను ‘నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకుని అడ్మిట్ కార్డుతోపాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికె ట్లు ఒరిజినల్, జిరాక్స్, ఒక పాస్‌పోర్టు సైజ్ ఫోటోతో ఆ రోజు ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా ప్రాంగణానికి హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్: 79956 91295, టోల్ ఫ్రీ: 9988853335 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment