సోమవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2025
● పింఛన్ లబ్ధిదారులపై పగబట్టిన కూటమి ప్రభుత్వం
● నేటి నుంచి పలు రకాల పింఛన్‌ల తనిఖీ
● అర్హత పరీక్ష పేరుతో తొలగించే యత్నం
● నాలుగు దశల్లో తొలగింపు చర్యలు
● జిల్లాలో ఇప్పటి వరకు అందిస్తున్న పింఛన్లు 1.41 లక్షలు
● అర్హత తనిఖీలకు 4 వైద్యబృందాలు
● తొలి దశలో రూ.15వేలు ఇచ్చే పింఛన్ల అర్హత పరీక్షలు
● రెండవ దశలో విభిన్న ప్రతిభావంతులకు పరీక్షలు
● దశలవారీగా తొలగించేందుకు చర్యలు
జిల్లాలో ప్రతినెలా వివిధ రకాలకు చెందిన 1,41,629 మంది లబ్దిదారులకు ప్రతి నెలా రూ. 59.07 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడు నెలల్లోనే అందులో వివిధ రకాల కారణాలతో సుమారు 3400 మంది వరకు తగ్గించారు. మరింత మందిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా పలు దశలుగా పింఛన్ల తనిఖీలు చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి జిల్లాలో వైద్యులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించనున్నరు. ఇందులో ముందుగా రూ.15వేలు పొందుతున్న పింఛన్‌దారులను తనిఖీ చేయనున్నారు.
న్యూస్‌రీల్
పింఛనర్ల టెన్షన్
Comments
Please login to add a commentAdd a comment