తనిఖీకి శ్రీకాకుళం నుంచి 4 వైద్య బృందాలు
నేటి నుంచి పింఛన్ తనిఖీలు మొదలు పెట్టనున్న నేపథ్యంలో ఒక్కో బృందంలో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఒక పీహెచ్‌సీ డాక్టర్, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే సదరం సర్టిఫికెట్లు జిల్లా డాక్టర్లు ఇవ్వడంతో అదే డాక్టర్లు తనిఖీలు చేయడం సరికాదని నిర్ణయించారు. దీంతో శ్రీకాకుళం జిల్లా నుంచి 8 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను జిల్లాకు నియమించారు. ఈ క్రమంలో డాక్టర్లు తనిఖీ చేస్తున్న సమయంలో వారికి భద్రత కోసం ఒక్కో బృందానికి సచివాలయ మహిళా పోలీసులను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment