పారదర్శకంగా తనిఖీలు
పింఛన్ల తనిఖీలు పారదర్శకంగా చేపట్టేలా చర్యలు తీసుకున్నాం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. జిల్లాలో తొలిదశలో 87 మంది త్రీవమైన మస్క్యులర్ డిస్ట్రోఫీ సమస్యలు ఉన్న వారిని తనిఖీలు చేస్తాం. తనిఖీలు చేపడుతున్న నాలుగు బృందాలకు అన్ని శాఖల అధికారులు సహకరించాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి 8 మంది వైద్యులతో నాలుగు బందాలను ఏర్పాటు చేశాం.
– డాక్టర్ భాస్కరరావు,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి,
పార్వతీపురం మన్యం
పేదల పొట్ట కొట్టేందుకు చర్యలు
కూటమి ప్రభుత్వం పేదల పొట్ట కొట్టే విధంగా చర్యలు చేపట్టంది. పింఛన్‌లు పెంచామంటూ ఊదరగొట్టి ఇప్పుడు తొలగింపు చర్యలు చేపట్టి తన మార్క్ పాలన కొనసాగిస్తోంది. అధికారం చేపట్టి 200 రోజులు గడుస్తున్నా ప్రజలకు మేలు చేయకుండా యూటర్న్ పాలిటిక్స్ చేస్తోంది. ఇప్పటికైనా ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– అలజంగి జోగారావు,
మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం
50 ఏళ్లకే పింఛన్ అన్నారు..
ఇప్పుడు ఉన్నవి తొలగిస్తున్నారు
ఎన్నకల ముందు పింఛన్‌లు పెంచుతామని, 50 ఏళ్లకే పింఛన్‌లు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు అర్హత పరీక్షల పేరుతో తొలగించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మెసం చేయడం చంద్రబాబుకు అలవాటు. ఇదంతా పింఛన్లు తొలగించేందుకు చేస్సున్న తనిఖీలే.
–శత్రుచర్ల పరీక్షిత్ రాజు,
వైఎస్సార్‌సీపీ, జిల్లా అధ్యక్షుడు,
పార్వతీపురం మన్యం
●
Comments
Please login to add a commentAdd a comment