ఆశ్రమ పాఠశాలలో పల్లె నిద్ర
జియ్యమ్మవలస: మండలంలోని వనజ గిరిజ న ఆశ్రమ పాఠశాలలో బుధవారం రాత్రి జిల్లా ఆహార భద్రతా అధికారి రామయ్య పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. రికార్డులు, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సదుపాయాన్ని పరిశీలించారు. విద్యా ర్థుల అభ్యసనా సామర్థ్యాలు పరీక్షించారు. గురువారం ఉదయం వనజ గ్రామాన్ని సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా గర్భిణులకు పౌష్టి కాహారం సరఫరాపై ఆరా తీశారు. మలేరియా, ఎనీమియా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రవిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment